TG: పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనం అని స్పష్టం చేశారు. కొందరు వారి మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని ధ్వజమెత్తారు. అందుకే మూసీ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.