TG: రాష్ట్రంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పూడూరు గేటు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌ని ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.