బెంగుళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్(NZ) దూకుడుగా ఆడుతోంది. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి NZ 82/1 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్ కాన్వే(51), టామ్ లాథమ్(15) పరుగులతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం కాన్వే(61*), విల్ యంగ్(5*) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ కాగా.. NZ 36 పరుగుల లీడ్‌లో ఉంది.