KDP: రైల్వే కోడూరు టౌన్ పరిధిలో శివాలయం దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి వస్తున్న లారీ రోడ్డు దాటుతున్న ఇరువురి లక్ష్మమ్మను ఢీకొట్టింది. ఆమె కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వృద్ధురాలు మతిస్థిమితం తప్పి పడిపోయింది. పోలీసులు వెంటనే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.