SRCL: జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.