»Mom I Have To See My Father Devansh Asks To Brahmani
nara lokesh son:దేవాన్ష్ అడగడంతో లోకేశ్ వద్దకు బ్రాహ్మణి
నాన్నను చూడాలని దేవాన్ష్ (Devansh) అడగగా కొత్తూరు విడిది కేంద్రానికి నారా బ్రాహ్మణి (nara brahmani) చేరుకున్నారు. కుమారుడు అడగగా క్షణం ఆలోచించకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ (hyderabad) నుంచి కొత్తూరుకు బయల్దేరారు. ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన భోజనం తీసుకొచ్చారట. కుమారుడు, భార్యతో కలిసి ఇంటి వద్ద నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ ఆరగించారట. కుమారుడితో కాసేపు సరదాగా లోకేశ్ గడిపారు.
nara lokesh son:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. యువత (youth), మహిళలు (woman) ఆయన వెంట నడుస్తున్నారు. నాన్నను చూడాలని దేవాన్ష్ (Devansh) అడగగా కొత్తూరు విడిది కేంద్రానికి నారా బ్రాహ్మణి (nara brahmani) చేరుకున్నారు. కుమారుడు అడగగా క్షణం ఆలోచించకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ (hyderabad) నుంచి కొత్తూరుకు బయల్దేరారు. ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన భోజనం తీసుకొచ్చారట. కుమారుడు, భార్యతో కలిసి ఇంటి వద్ద నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ ఆరగించారట. కుమారుడితో కాసేపు సరదాగా లోకేశ్ గడిపారు.
లోకేశ్ వద్దకు బ్రాహ్మణి, దేవాన్ష్
పాదయాత్ర ఎలా సాగుతోందని లోకేష్ (lokesh)ను నారా బ్రాహ్మణి అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ప్రభుత్వం అడుగడుగునా సృష్టిస్తున్న అడ్డంకులను తెలుగు తమ్ముళ్లు (Telugu Thammullu) ఆమెకు వివరించారు. ఈరోజు పాదయాత్రలో లోకేష్‌తో కలిసి బ్రాహ్మణి (nara brahmani) అడుగులేస్తారని తెలిసింది. దేవాన్ష్ కూడా అమ్మ, నాన్నలతో కలిసి పాదయాత్ర చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈరోజు పాదయాత్ర ముగిసేవరకూ బ్రాహ్మణి, దేవాన్ష్ (devansh) లోకేష్‌తో ఉంటారని తెలుస్తోంది. లోకేష్‌తోపాటు బ్రాహ్మణి కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి 09.05 గంటలకు లోకేష్ (lokesh) బస చేసే కేంద్రానికి చేరుకుంటారు. తర్వాత బ్రాహ్మణి, దేవాన్ష్ హైదరాబాద్ బయల్దేరుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
షెడ్యూల్ ఇలా
గంగాధర నెల్లూరు (Gangadhara Nellore) నియోజకవర్గంలో నారా లోకేశ్ (lokesh) యువగళం పాదయాత్ర ఆదివారం (ఈరోజు) జరగనుంది. 11.30 గంటలకు కొత్తూరు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గీయులతో నారా లోకేశ్ ముఖాముఖి సమావేశం అవుతారు. మధ్యాహ్నం 01.55 గంటకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 03.15 గంటలకు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 04.20 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 05.40 గంటలకు డీఎం. పురం గ్రామస్తులతో ముచ్చటిస్తారు. రాత్రి 07.50 గంటలకు పాదయాత్ర ద్వారకా నగర్‌కు చేరుకోనుంది. రాత్రి 09.05 గంటలకు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు విడిది కేంద్రంలో నారా లోకేశ్ (lokesh) బస చేస్తారు.
అడ్డంకులు
నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు (police) అడుగడుగున్నా ఇబ్బందులు కలిగిస్తున్నారట. ఇప్పటికే 5 కేసులు (5 cases) నమోదు చేశారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. బహిరంగ సభ నిర్వహించే చోట కూడా మైక్ ఇవ్వడం లేదని అంటున్నారు. అయినప్పటికీ తమ నేత 16 రోజులు యాత్ర చేపట్టి.. 200 కిలోమీటర్ల మైలురాయి దాటారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో గల ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగనుంది.