»Banda Prakash Is Unanimous As Deputy Chairman Of Telangana Legislative Council
Banda prakash: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవం
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ(MLC) బండా ప్రకాశ్ ముదిరాజ్(Banda Prakash Mudiraj) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) ప్రకటిస్తూ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రకాశ్ కు పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించారు. అంతేకాదు కేసీఆర్ బండా ప్రకాశ్ ను ఆహ్వానించి ఛైర్మన్ కూర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమని కేసీఆర్ అన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రకాశ్ ముదిరాజ్ వర్గానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు.
గతంలో ఎంపీగా ఉన్న ప్రకాశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్(KCR) తెలిపారు. మరోవైపు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్(neti vidyasagar) పదవి కాలం పూర్తినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంటుంది. బండా ప్రకాశ్ 2021లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. బండ ప్రకాష్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో బండ సత్యనారాయణకు జన్మించాడు. 1996లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పీహెచ్డీ పూర్తి చేశారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్(minister ktr) కూడా ప్రకాశ్ కు అభినందనలు తెలియజేశారు. అతని అనుభవం సభకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.