»Veg And Non Veg Markets In Each Constituency In Telangana 1500 Asha Posts In Ghmc Area
KCR: ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు..1,500 పోస్టులు
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధీలో ఈనెలలోనే 1,500 ఆశా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
తెలంగాణ(Telangana)లో అన్ని జిల్లాల్లో హైదరాబాద్(hyderabad)మోండా మార్కెట్(monda market) లాంటివి నిర్మించాలని సిద్ధమైనట్లు సీఎం కేసీర్(cm kcr) పేర్కొన్నారు. దాదాపు రెండు లక్షల జనాభాకు ఒక మార్కెట్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే నారాయణ పేట(narayanpet market) కూరగాయల మార్కెట్ అద్భుతంగా కట్టారని అన్నారు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన మోండా మార్కెట్(monda market) చూసి తాను ఆశ్చర్యపోయినట్లు గుర్తు చేశారు. చాలా సైంటిఫిక్ గా కట్టారని ప్రశంసించారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లందరికీ ఈ మార్కెట్ చూపించినట్లు తెలిపారు.
దాదాపు కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ప్రజలకు సరిపోయే విధంగా మార్కెట్లు లేవన్నారు. కేవలం ఐదు నుంచి ఆరు మాత్రమే ఉన్నాయన్నారు. మనం ప్రతి రోజు తిసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలన్నారు. ఈ క్రమంలో మార్కెట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతోపాటు ప్రతి నియోజకవర్గం(each constituency)లో ఆధునాతన కురగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసి నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
మరోవైపు అనేక ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు(vegetable markets) పరిశుభ్రంగా లేవన్నారు. సమీకృత మార్కెట్లను ఆధునాతనంగా ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి తోడు కల్తీ విత్తనాల కట్టడికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈరోజుతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana assembly meetings) పూర్తి కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ ప్రకటించారు.
మరోవైపు జీహెచ్ఎంసీ(GHMC) పరిధీలో ఈనెలలోనే 1,500 ఆశా పోస్టు(Asha posts)లను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు(Harish Rao) తెలిపారు. ఉస్మానియా, నిమ్స్ సహా పలు ఆస్పత్రులకు ప్రజల రాక పెరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలో మరింత మందికి సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే బస్తీ దవాఖానలు కోటి మందికిపైగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో న్యూట్రిషన్ కిట్స్ కూడా పంపిణీ చేస్తామని..మేడ్చల్ జిల్లాలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.