»Padayatra For Marriage Karnataka Mandya District To Mm Hills
Padayatra for bride:పెళ్లి కావాలని 250 మంది యువకుల పాదయాత్ర
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో సాధారణంగా రాజకీయాల్లో పదవుల కోసం అనేక ప్రాంతాల్లో పలువురు నేతలు పాదయాత్రలు చేస్తున్న సందర్భాలు చూశాం. మరికొన్ని చోట్ల అభిమాన హీరో, హీరోయిన్లను కలిసేందుకు అభిమానులు కూడా పాదయత్ర చేసిన సంఘటనలు కూడా విన్నాం. కానీ వినూత్నంగా 250 మంది బ్రహ్మచారులు(bachelors) తమకు పెళ్లి కావాలని పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కర్ణాటక(karnataka)లో చోటుచేసుకుంది.
106 కిలోమీటర్లు..
అయితే 30 ఏళ్లు పైబడిన వీరంతా ఫిబ్రవరి 23న సాయంత్రం 4.30 గంటలకు కేఎం దొడ్డిలోని మారిగుడి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి ‘బ్రహ్మచారిగల నడిగె మలే మహదేశ్వర బెట్టాడ కడగె’ అనే నినాదంతో పాదయాత్ర చేయనున్నారు. మలవల్లి, హనూరు మీదుగా పాదయాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల(Male Mahadeshwara Hills)వరకు మూడు రోజుల్లో 106 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. తొలి బ్యాచ్లో 250 మందిని మాత్రమే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని నిర్వహకులు శివప్రసాద్ స్పష్టం చేశారు.
దైవ జోక్యం
ఈ క్రమంలో ప్రతి గ్రామం నుంచి దాదాపు 30 మంది బ్రహ్మచారులు(bachelors) ఉంటారని ఓ బ్రహ్మచారి పేర్కొన్నారు. పెళ్లికి తగిన వధువు(bride)ను పొందడం కూడా వారి ప్రార్థనలలో ఒకటిగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ పెళ్లికి సరైన వధువులను చూపించాలని దైవ జోక్యాన్ని కోరుతూ పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల వధువులను పొందడం కష్టంగా మారిందని అంటున్నారు. మాండ్య, రామనగర్, మైసూరు, బెంగళూరు(bengaluru) నుంచి ఇప్పటివరకు 120 మంది సభ్యులు పాదయాత్ర కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. మరోవైపు రైతులు, వారి పిల్లలతో పాటు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు కూడా నమోదు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
శ్రీమంతులుగా మారినా కూడా
మాండ్యా జిల్లా(mandya district)లోని ఈ పురుషులు, ప్రధానంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఉండగా వారికి వధువులు దొరకడం చాలా కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు వీరిలో అనేక మందికి మంచి ఆస్తులు, భూములు ఉండి శ్రీమంతులుగా మారిన తర్వాత కూడా వధువులు దొరకడం లేదని అంటున్నారు. మరోవైపు ఈ జిల్లాలో ఒకప్పుడు ఆడ పిల్లల భ్రూణహత్యలు(Female infanticide) ఎక్కువగా జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పురుషులే ఎక్కువగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రధానంగా యువ రైతులు
ప్రస్తుతం ఎక్కువ మంది ఆడపిల్లలు(girls) చదువుకుని ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండడంతో జీవిత భాగస్వాముల విషయంలో కూడా చాలా స్పృహతో ఎంపిక చేసుకుంటున్నారని మరికొంత మంది అంటున్నారు. జీవితాంతం భద్రతను దృష్టిలో ఉంచుకుని వరుడిని ఎంపిక చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం రైతుల జీవితానికి(farmers life) తగిన భద్రత(secure) లేనందున యువ రైతుల(young farmers)ను పెళ్లి చేసుకునేందుకు ఎక్కువగా అమ్మాయిలు ముందుకు రావడం లేదని పలువురు బ్రహ్మచారులు వాపోతున్నారు.
ఈ సమస్య అనేక ప్రాంతాల్లో..
ఈ సమస్య ఒక్క మండ్య జిల్లాలోనే కాదు..కర్ణాటకతోపాటు అనేక రాష్ట్రాల్లో సర్వసాధారణమైపోయిందని ఇంకొంత మంది అంటున్నారు. కావున ప్రభుత్వం రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రైతుల జీవితాలకు కూడా భద్రత కల్పించాలని, లేదంటే యువత నష్టపోతారని అంటున్నారు. దేశానికి తిండిపెట్టే వ్యవసాయాన్ని(agriculture) నిర్లక్ష్యం చేయడం తగదని అంటున్నారు. ప్రభుత్వం అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఫసల్ భీమా యోజన బీమా పథకాన్ని అన్ని పంటలకు విస్తరించాలని అంటున్నారు. రైతుల ఆదాయంతోపాటు మరిన్ని మార్పులు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అంటున్నారు.