Yash Next Project : కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. కెజియఫ్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. కెజియఫ్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అసలు ఏ మాత్రం బజ్ లేకుండా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కెజియఫ్.. ఇంత సంచలనం అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాజమౌళి తర్వాత పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ప్రశాంత్ నీల్‌తో పాటు.. యష్ కూడా ప్రభాస్, బన్నీ తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు యష్. అందుకే కెజియఫ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మధ్యలో కన్నడ డైరెక్టర్ నర్తన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమాలు చేయబోతున్నట్ట వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఓ కోలీవుడ్ డైరెక్టర్‌తో యష్ సినిమా ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఈ మధ్య తమిళ్ హీరో కార్తి నుంచి ‘సర్దార్’ అనే స్పై థ్రిల్లర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే కదా.. ఆ సినిమాను దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తెరకెక్కించాడు. సర్దార్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు.. మిత్రన్, యష్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే నిజంగానే ఈ కాంబో సెట్ అయిందా.. లేదా.. అనే క్లారిటీ రావాల్సి ఉంది. మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.