»Karunakar Sawal To Brs Government On Dharani Portal Issues
Dharani Portal:తో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ(telangana)లో ధరణి పోర్టల్(dharani portal) వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి(karunakar desai kethireddy) పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. అలా నిరూపించకపోతే మీరేం చేస్తారో కూడా చెప్పాలని నిలదీశారు. రంగారెడ్డి(rangareddy) జిల్లా యాచారంలో భూ న్యాయ శిబిరం ఏర్పాటు చేశామని..అసెంబ్లీలో ధరణీ అంశం గురించి మాట్లాడిన మంత్రులు శనివారం ఇక్కడకు రావాలని కోరారు. ఒక్కసారి నేరుగా వచ్చి రైతుల బాధలు(farmers problems) ఎంటో చూడాలని కోరారు. అసెంబ్లీలో గొప్పలు చెప్పడం ఎవరికైనా సులువేనని హితవు పలికారు.
ఇక ధరణిలో సమస్యలపై సీఎం కేసీఆర్(kcr) అసెంబ్లీలో ఫిబ్రవరి 9, 2023న స్పందించారు. ఈ పోర్టల్ కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు. అవి సాఫ్ట్ వేర్ ద్వారా వచ్చిన సమస్యలేనని అన్నారు. వాటికి రెవిన్యూ వ్యవస్థకు సంబంధం లేదన్నారు.
మరోవైపు ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు చేయడం సురక్షితమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(prashanth reddy) తెలిపారు. ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసే అవకాశమే లేదన్నారు. కానీ ఈ పోర్టల్ కారణంగా కొంత మంది రైతుల భూ సమస్యలపై 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. వాటిలో 12 లక్షల వరకు పరిష్కరించామని వెల్లడించారు.
అసలు ధరణితో ఇబ్బందులు లేకుంటే అన్ని లక్షల అప్లికేషన్లు ఎందుకు వచ్చాయని సోషల్ మీడియా(social media)లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా సమస్యలు ఉండి దరఖాస్తు చేసుకోని రైతుల పరిస్థితి ఎంటని అడుగుతున్నారు. మరోవైపు పెండింగ్లో ఉన్న లక్షల అప్లికేషన్లను ఎప్పటివరకు పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల భూ సమస్యల కోసం కార్యాలయాల చూట్టు తిరిగుతున్నా కూడా ప్రజాప్రతినిధులకు అవేవి కనిపించవని ఎద్దేవా చేస్తున్నారు.
ధరణి పోర్టల్(dharani portal) ద్వారా కొనుగోలు దారుడు మ్యూటేషన్ ప్రక్రియ పూర్తైందని అనుకుంటాడు. కానీ తర్వాత పట్టాదారు ప్రమేయం లేకుండానే ధరణి పోర్టల్ నుంచి ఇంకొంత మందికి పట్టా మార్పిడి జరుగుందని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అసలు పట్టాదారుకు ఇబ్బందులు ఉండటం లేదన్నారు. ఇలాంటి సమస్యలు తీర్చాలంటే అసలు ఓ వేదిక అని ఏదీ లేదని అంటున్నారు. తమ సమస్యలు తీర్చాలంటే అప్లికేషన్ చేయాలని వాటి పరిష్కారం కోసం అనేక రోజులుగా వేచి చూస్తున్నామని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి సరియైన సిబ్బంది లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం సేకరించని వందల ఎకరాల భూములకు ఎల్ఏజీ(LAG) నంబర్లతో పీఓబీ(POB)లో ఎంట్రీ చేశారు. అయితే ఈ వ్యవహరంపై తమకు సమాచారం కూడా ఇవ్వలేదని బాధిత రైతులు(farmers) చెబుతున్నారు. ఈ క్రమంలో విలువైన భూములను తాము కాపాడుకోలేక పోయామని బాధిత రైతులు చెబుతున్నారు. పలువురు అధికార పార్టీ నేతలు ఎల్ఏజీ నంబర్లతో కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. హైటెక్ సిటీ(hitech city), ఫైనాన్షియల్ డిస్ట్రిక్(financial district) పరిధిలోని ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా కొనసాగుతుందని అంటున్నారు. ఈ ప్రాంతాల్లో గజం లక్ష రూపాయలు ఉండగా..వీటిని అధిగమించేందుకే ఎల్ఏజీ నంబర్లతో అక్రమ నిషేధం అమలు చేస్తున్నారని చెబుతున్నారు.