PPM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలో డోలపేట గ్రామానికి చెందిన శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేలుస్తున్న సమయంలో ఒక ఔట్ బాక్స్ నేరుగా వచ్చి ఆమెకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.