»Bandi Sanjay Shocking Comments On New Secretariat
Bandi Sanjay : సచివాలయం డోమ్స్ కూలగడతాం…
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే… సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే… కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కేవలం ఎంఐఎం సంతోషం కోసమే సచివాలయ నిర్మాణం చేసినట్లు ఉన్నారని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మితమౌతున్న సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని బండి సంజయ్ అన్నారు. అసద్ కళ్లల్లో ఆనందం చూడడానికే తాజ్ మహల్ నమూనాలో సచివాలయం కట్టారని బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణలో రజకార్ల రాజ్యం పోవాలని, రామ రాజ్యం రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రోడ్డు పక్కన ఉన్న గుడులు, మసీదులు కూల్చుతానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ కు దమ్ముంటే పాతబస్తీ నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని సవాలు విసిరారు.
ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో కోట్లాది రూపాయలు దోచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తమ కుటుంబం బాగుండాలని కోరుకునే తండ్రీ కొడుకులు, రాష్ట్ర ప్రజలు బాగు పడాలని కోరుకోవడం లేదని ఆరోపించారు.