ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరినూనె, ఉసిరి మిశ్రమం బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు . 4 చెంచాల కొబ్బరి నూనెలో 3 చెంచాల ఉసిరి పొడిని కలిపి వేడి చేయాలి. ఈ పేస్ట్ చల్లారాక తలకి పట్టించి మసాజ్ చేయాలి. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది.