Tamilnadu : కడుపుతో ఉన్న ఆడవారికి సీమంతం చేయడం మన ఆచారంగా వస్తూ ఉంది. అలా సీమంతం చేయడం వల్ల... తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా పుడతారని నమ్ముతుంటారు. అయితే.. ఓ వ్యక్తి మనం దేవతలా పూజించే గోమాతకు కూడా సీమంతం చేయాలని భావించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కడుపుతో ఉన్న ఆడవారికి సీమంతం చేయడం మన ఆచారంగా వస్తూ ఉంది. అలా సీమంతం చేయడం వల్ల… తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా పుడతారని నమ్ముతుంటారు. అయితే.. ఓ వ్యక్తి మనం దేవతలా పూజించే గోమాతకు కూడా సీమంతం చేయాలని భావించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని కల్లకురిచ్చిజిల్లా శంకరాపురం గ్రామంలోని ట్రస్ట్ సిబ్బంది. గర్భిణిగా ఉన్న అంశవేణి అనే అవుకు అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిపించారు. సీమంతం వేడుకకు అంశవేణిని బాగా అలంకరించారు.
అంశవేణి సంరక్షణ చూస్తున్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్ట్స్ కూడా అందించడం గమనార్హం