»Ysr Kalyanamastu And Shadi Tofa Funds Were Released By Cm Jagan
YSR Kalyanamastu : వైఎస్సార్ కల్యాణమస్తు షాదీ తోఫా నిధుల విడుదల
వైయస్సార్ కళ్యాణమస్తు, ('YSR Kalyanamastu')వైయస్సార్ తోపా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీ ఎం జగన్ (CM Jagan)జమ చేశారు. తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
వైయస్సార్ కళ్యాణమస్తు, (‘YSR Kalyanamastu’)వైయస్సార్ తోపా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీ ఎం జగన్ (CM Jagan)జమ చేశారు. తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆడ బిడ్డల పెళ్లిళ్లు ఆర్థికంగా భారం కాకూడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పర్యాయం ప్రభుత్వం మొత్తం 4,536 కుటుంబాలకు రూ.38.13 కోట్లను పంపిణీ చేసింది. అక్టోబరు- డిసెంబర్ (October – December) మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామన్నారు. ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తిచేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని, మే నెలలో వారికి అందజేస్తామన్నారు.
ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, పేదవాడి తలరాత మారాలంటే.. విద్య అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతాయన్నారు సీఎం జగన్. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయికూడా ఖర్చుగా భావించడం లేదని, పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈపథకానికి నిర్దేశించామని వ్యాఖ్యానించారు. ఇక పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు కూడా చదువుల బాట పట్టాలనే ఇది చేస్తున్నామని, పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాల (Child marriages) నివారించడం, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం పెట్టామన్నారు. కనీస వయస్సు.. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లు నిర్దేశించాం.. టెన్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలనిచెబుతున్నామన్నారు.ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్ వరకూ తీసుకున్నామని, తర్వాత అమ్మ ఒడి ఉండటంతో సహజంగానే ఇంటర్మీడియట్ చదువుకుంటారు..
ఆ తర్వాత విద్యాదీవెన, (Vidyādīvena) వసతి దీవెన పథకాలు ఉన్నాయి.. అందుకే ఇంటర్మీడియట్ (Intermediate) నుంచి వారి చదువులు ఆగిపోకుండా ముందుకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందని, వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా (Shadi Tofa) డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని ఆయన వెల్లడించారు.పలువురి సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, పెళ్లిళ్లుకోసం కొంతకాలం ఆగొచ్చు.. కానీ చదువులు ఆగిపోకూడదనేది మా ఉద్దేశమన్నారు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందని, పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులుముందుకేస్తున్నామన్నారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో మెరుగుపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని సీ ఎం తెలిపారు