ASF: వాంకిడి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాలలలోని తరగతి గదులను మరియు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలను బోధించారు. సబ్జెక్టులపై ప్రశ్నలను అడిగారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి చూయించాలని పాఠశాల ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.