TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి జంక్షన్, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.