GNTR: నల్లచెరువు ప్రాంతంలో ఇటీవల వీధికుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్ (GGH)లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఫణీంద్ర, ఆయాన్లను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా మంగళవారం రాత్రి పరామర్శించారు.ఆసుపత్రిలో చిన్నారులు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆమె, మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు.