NZB: కామారెడ్డి జిల్లా మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని గ్రామాలలో వరి, పత్తి పంటలను రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త టి. విజయ్ కుమార్ పరిశీలించారు. వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, కంకి నల్లి, గింజ మచ్చ తెగులు గమనించడం జరిగిందని తెలిపారు. పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు శాస్త్రవేత్త వివరించారు.