అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ కోసం మలయాళ నటుడు సిద్దిఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సిద్దిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిద్దిఖీ పిటిషన్ దాఖలు చేశాడు.