బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ గ్రాండియర్‌గా రూపొందిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌కు ఇంకో మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడం లేదు. కానీ ఒక్కసారి రంగంలోకి దిగితే వరుస అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు డైలమాలో ఉన్న ఆదిపురుష్ లుక్.. ఇప్పుడు రావడం పక్కా అంటున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. దసరా సందర్భంగా అక్టోబరు 2న ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. ఇక ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్ అప్డేట్స్ ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నారట. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆదిపురుష్ అప్డేట్ అంతకు మించి అనేలా ఉండబోతోందట. పైగా దీపావళి కూడా అదే సమయంలో రావడంతో.. ఆదిపురుష్ మరింత స్పీడ్ పెంచే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ దసరాకు మిస్ అయినా ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ మాత్రం అదిరిపోవడం ఖాయమంటున్నారు. మొత్తంగా ఆదిపురుష్ సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు.