Ram Charan: చరణ్ సోషల్ మీడియా రికార్డ్.. థర్డ్ ప్లేస్‌లో!
రామ్ చరణ్ ఇన్‌స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నారు.
రామ్ చరణ్ ఇన్‌స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు చెర్రీ. ఒక్క పాన్ ఇండియా మాత్రమే కాదు.. హాలీవుడ్ రేంజ్లో అట్రాక్ట్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో చరణ్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఫాస్టెస్ట్ రికార్డు అందుకున్నాడు. 12 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో ఇద్దరు హీరోలు మాత్రమే ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 19.9 మిలియన్స్ మంది ఫాలోవర్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో 17.8 మిలియన్స్ ఫాలోవర్స్‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇక ఇప్పుడు 12 మిలియన్స్ ఫాలోవర్స్‌తో థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు చరణ్. అయితే ప్రస్తుతం శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. చరణ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. విజయ్ దేవరకొండ, బన్నీని సైతం క్రాస్ చేస్తాడని అంటున్నారు మెగాభిమానులు. మొత్తంగా.. రోజు రోజుకి సోషల్ మీడియాలో చరణ్ క్రేజ్ ఓ రేంజ్లో పెరుగుతోందని చెప్పొచ్చు.