ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గుండెలో రెండు వాల్ మూసుకుపోయాయని డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వీరిది కీలకపాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి ఇదివరకు ముందుకు వచ్చాడు. నాన్నా.. నేను ఎవరినీ అని అడిగాడు. తమను ఎందుకు దూరం పెట్టావు.. 18 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. నీ ఆస్తి, నీ అంతస్తు, రాజకీయ వారసత్వం అవసరం లేదని.. ఒక కొడుకుగా అంగీకరించు అని దీనంగా కోరాడు. లేదంటే డీఎన్ఏ టెస్ట్‌కు వెళదాం అంటూ సవాల్ విసిరాడు. శివచరణ్ రెడ్డి లేఖ వదిలినా, మరోసారి మీడియా ముందుకు వచ్చినా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం మౌనంగానే ఉన్నారు.
ఓ ఇంటర్వ్యూలో తనకు కొడుకులు లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంతో శివచరణ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. అతని తల్లి చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న పాత ఫొటోలను షేర్ చేశారు. కుమారుడిగా మీడియా ముఖంగా ఒప్పుకోవాలని, లేదంటే డీఎన్ఏ పరీక్షకు సిద్దం కావాలని సవాల్ చేశారు. తాను చూపించిన ఆధారాలపై ఇంత వరకు స్పందించలేదని అంటున్నారు. ఇంతలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు.