TG: రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు.