కృష్ణ: మైలవరం పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ‘స్వచ్ఛత హీ సేవా 2024లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించి, రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి వరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.