ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు పెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అప్డేట్ కావాలంటూ మొండి పట్టు పట్టారు అభిమానులు. అయితే ఎట్టకేలకు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ 30 పై స్పందించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు.. మార్చి 20న షూటింగ్ స్టార్ట్ చేసి.. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని చెప్పాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. దాంతో సెప్టెంబర్‌లో ఎన్టీఆర్31 వర్క్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికైతే ఎన్టీఆర్ 32 బుచ్చిబాబుతో ఉండాల్సింది. కానీ రామ్ చరణ్‌తో బుచ్చిబాబుని సెట్ చేశాడు ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటనేది క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మరోసారి ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడట తారక్. ఎన్టీఆర్ 31ని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఎన్టీఆర్ 32ని కూడా ప్లాన్ చేస్తోందట. దాంతో ఎన్టీఆర్ 31 సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్నారా.. లేదంటే కొత్త సబ్జెక్ట్‌తో సినిమా చేయబోతున్నారా.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన తర్వాత.. తమిళ దర్శకుడు వెట్రీ మారన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. మరి తారక్ లైనప్ ఇదేనా.. లిస్ట్‌లోకి కొత్త డైరెక్టర్స్ వస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.