అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం.
తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పెట్టిన అక్రమ అక్రమ కేసులు, నిర్బంధనలు, అణచివేతలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసుల గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరుకు తన జీవితంలో ఎప్పుడు తనపై ఒక్క కేసు కూడా లేదని తనపై గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 17 కేసులు పెట్టారని.. ఒక్కటి కూడా సరైనది కాదని చెప్పారు
కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ పై పెట్టిన 7 కేసుల గురించి కూడా చంద్రబాబు ప్రెసెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ నుండి అమరావతికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను మార్గమధ్యలో ఆపేస్తే… రోడ్ మీద పడుకుని నిరసన తెలియజేసారు అని గుర్తుచేసుకున్నారు, దీనికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నవ్వారు.