passport : పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో టాప్‌లో సింగపూర్.. భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏంటో తెలుసా? సింగపూర్ దేశపు పాసా్పోర్ట్ అట. వరల్డ్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో మరి మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం రండి.
passport rankings : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్ దేశానిదట. ఈ విషయం హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. ఒక దేశపు పాస్‌పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వెళ్లవచ్చు? ఆ దేశం నుంచి మిగిలిన దేశాలకు ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయి? తదితర అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ని విడుదల చేస్తుంది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం(International Air Transport Authority (IATA)) నుంచి వివరాలను సేకరించి ఈ ర్యాంకింగ్స్‌ని తయారు చేస్తుంది.
ఒక్క సింగపూర్ పాస్‌పోర్ట్(passport) ఉంటే చాలు.. ఆ వ్యక్తి 195 దేశాలకు తేలికగా వీసా లేకుండా వెళ్లి రాగలుగుతాడు. అందుకనే ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్లు ఉన్నాయి. ఈ పాస్‌పోర్ట్‌లు ఉన్న వారు 194 దేశాలను తేలికగా యాక్సస్ చేయగలరు.
ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్ దేశాలు ఉన్నాయి. వీటి పాస్‌పోర్ట్‌ల ద్వారా 193 దేశాలకు తేలికగా వీసాలు లేకుండా వెళ్లి రావచ్చు. ఇక భారత్ విషయానికి వస్తే.. ప్రపంచ శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో మన దేశం 82వ స్థానంలో ఉంది. గతంలో విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో(rankings) ఇండియా( INDIA) 85వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 82వ స్థానానికి చేరుకుంది. మన పాస్‌పోర్ట్‌తో మొత్తం 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు మనం ఇలా వెళ్లిరావచ్చు.