ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లలు తొందరగా ఎత్తు పెరగడం లేదు. వాళ్ల బరువుకు తగ్గ ఎత్తు ఉండటం లేదు. పెరిగే వయస్సు ఉన్న కొందరు పిల్లలు ఎత్తు పెరగడం లేదు. మరి పిల్లలు తొందరగా ఎత్తు పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
Kids: Are children not growing taller? But do this
Kids: పిల్లలతో స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తుండాలి. ఇవి సులభంగా ఉండటంతో పాటు పిల్లలు ఎత్తు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. నిటారుగా నిల్చొని కిందికి వంగుతూ కాలి వేళ్లను అందుకోవడం, కాళ్లు ముందుకు చాపి కూర్చొని చేతి వేళ్లతో కాళ్లను అందుకోవడం, శరీర పైభాగాన్ని ఇరువైపులా వంచుతూ చేసే వ్యాయామాలు వెన్నెముకకు ఫ్లెక్సిబులిటీని అందిస్తాయి. ఇవి సులభంగా సాగేలా చేస్తాయి. దీనివల్ల పిల్లలు తొందరగా ఎత్తు పెరుగుతారు.
వీటితో పాటు బార్ హ్యాంగింగ్స్, హ్యాంగింగ్ రాడ్, పులప్స్, చిన్-అప్స్ వంటి ఎక్సర్సైజ్లు వెన్నెముక సులభంగా సాగేలా చేస్తాయి. దీనిద్వారా వయస్సుతో పాటు ఎత్తు కూడా పెరగవచ్చు. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే సైకిల్ నడిపించడం, యోగా వంటివి చేయించాలి. వీటివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. స్కిప్పింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా చేస్తే ఎత్తు పెరుగుతారు. రోజూ విటమిన్-డి అందేలా చూసుకోవాలి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో పాటు పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే పిల్లలు బరువుకి తగ్గట్టుగా ఎత్తు పెరుగుతుంటారు.