»Bharateeyudu 2 Huge Losses For Bharateeyudu 2 Even A Hundred Crores Is Difficult
Bharateeyudu 2: ‘భారతీయుడు 2’కి భారీ నష్టాలు.. వంద కోట్లు కూడా కష్టమే?
'కల్కి 2898 ఏడి' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోక నాయకుడు కమల్ హాసన్.. భారతీయుడు 2తో మరో హిట్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో భారతీయుడు 2కి భారీ నష్టాలు వచ్చేలా ఉన్నాయి.
Bharateeyudu 2: Huge losses for 'Bharateeyudu 2'.. Even a hundred crores is difficult?
Bharateeyudu 2: భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. జూలై 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజే ఓ మోస్తారు కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డే 26 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సెకండ్ డే నుంచి వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఇక ఫస్ట్ వీక్ ముగిసే నాటికి భారతీయుడు 2 ఇండియాలో 70 కోట్ల వరకు నెట్.. 140 కోట్లకు గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఇందులో ఒక తమిళంలోనే 50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక 8వ రోజున 43.59 శాతం కలెక్షన్స్ పడిపోయాయని అంటున్నారు. ఈ లెక్కన.. భారతీయుడు 2కి వంద కోట్ల నెట్ కూడా కూడా కష్టమేనని అంటున్నారు. వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. 100 కోట్లకుపైగా వసూళ్లు వస్తేనే ఓ మోస్తారు హిట్గా నిలుస్తుంది. కానీ వంద కోట్ల కలెక్షన్స్ అసాధ్యం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. కానీ.. భారతీయుడు 2 వసూళ్లను చూస్తే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో నష్టాలు తప్పేలా లేవు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కాగా.. ఇంకా 11 కోట్లకుపైగా వసూళ్లు రావాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రోజుకి లక్షల్లో కలెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి.. ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు. అయితే.. శంకర్ ఈ సినిమాకు థర్డ్ పార్ట్ కూడా రెడీ చేశాడు. మరో ఆరునెలల్లో రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి భారతీయుడు 3 వస్తుందా? లేదా? అనే చూడాలి.