»Red Alert For Telangana Heavy To Very Heavy Rain Forecast For Many Districts
Red Alert: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది.
Red alert for Telangana. Heavy to very heavy rain forecast for many districts
Red Alert: తెలంగాణ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమరం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
జూలై 20 న శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వీటితో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా మరో ఐదారు జిల్లాలలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. హెచ్ఎమ్డీ హెచ్చరించిన ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం పడే అవకాశం ఉందని, అదేవిధంగా వరదలు కూడా ముంచుకొచ్చే అవకాశం ఉందన హెచ్చరించింది. ఇక రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.