»Indian Railways If You Travel With A Waiting List Ticket You Will Be Fined
Indian Railways: వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణిస్తే జరిమానా తప్పదు!
భారతీయ రైల్వే ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన లేదా కౌంటర్ నుంచి కొనుగోలు చేసినా రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణించడానికి వీలులేదు.
Indian Railways: If you travel with a waiting list ticket, you will be fined!
Indian Railways: భారతీయ రైల్వే ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన లేదా కౌంటర్ నుంచి కొనుగోలు చేసినా రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణించడానికి వీలులేదు. వెయిటింగ్ టికెట్లతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వేరే స్టేషన్లో దిగి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ చేసిన వాళ్లకు ఇబ్బంది లేకుండా రద్దీ సమస్యలు లేకుండా ఉండేందుకు తీసుకొచ్చారు. చాలా ఏళ్లు ఇండియన్ రైల్వేలో కౌంటర్ దగ్గర టికెట్ బుక్ చేయడం.
రెండోది ఆన్లైన్లో బుక్ చేయడం ఉంది. కౌంటర్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంటే రిజర్వ్ కోచ్‌లో వెళ్లేపోయేవారు. కానీ ఇకపై అలా వెళ్తే జరిమానా తప్పదు. వెయిటింగ్ టిక్కెట్లతో రిజర్వ్ చేసిన కోచ్‌లలో ఎక్కిన ప్రయాణికులు పరిణామాలను ఎదుర్కొంటారు. తదుపరి స్టేషన్లో వారిని దించేసినా.. జరిమానా కింద ప్రారంభ స్టేషన్ నుంచి ట్రావెల్ పాయింట్ వరకు కనీస ఛార్జీ రూ. 440తో పాటు ఉంటుంది. ఇది ఏసీ కోచ్‌లో ప్రయాణించేవాళ్లకు మాత్రమే. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే రూ.250 జరిమానా ఉంటుంది.