»States May Allow Home Delivery Of Liquor Through Quick Commerce Platforms Like Swiggy Bigbasket And Zomato
Liquor Home delivery: మద్యం అన్లైన్ డెలివరీ.. ఆలోచిస్తున్న పలు రాష్ట్రాలు
ఇప్పుడంతా ఆన్లైన్ సర్వీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆల్కాహాల్‌ను సైతం హోమ్ డెలివరీ ఇచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రణాళిక మొదలు పెట్టాయి. ప్రస్తుతం దీనిపై హాట్ చర్చ నడుస్తోంది.
States may allow home delivery of liquor through quick commerce platforms like Swiggy, BigBasket, and Zomato
Liquor Home delivery: న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాలు మద్యాన్ని ఆన్లైన్ సర్వీస్ చేయాలని భావిస్తున్నాయి. స్విగ్గీ, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హోమ్ డెలివరీ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్‌గా తక్కువ మోతాదులో ఆల్కహాల్ అంటే బీర్, వైన్, లిక్కర్ వంటివి అందించాలని యోచిస్తున్నాయి. ఈ ఆలోచనను అభివృద్ధి చేయాలని అనుభవం ఉన్న అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీని కోసం ఆయా రాష్ట్రాల్లోని ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్పిరిట్స్ తయారు చేసే కంపెనీల నుంచి తగిన సమాచారాన్ని తీసుకుంటున్నారు.
పెరుగుతున్న జనభా దృష్ట్యా ఈ విధానాన్ని తీసుకురావాలని, అంతేకాదు చాలా మంది భోజనంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వినోదత్మాకంగా భావిస్తున్నారు. ఇదీ కాకుండా మద్యం తాగేవారు కూడా విపరీతంగా పెరిగిపోయారు చాలా సార్లు ఆల్కహాల్ విక్రయించే దుఖానాల వద్ద బారులు తీరుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల మహిళలు కూడా వైన్స్ షాప్‌లలో క్యూ కడుతున్నారు. ఇది అవమానకరంగా ఉంది. దానికి ప్రత్యమ్నాయంగా ఈ ఆన్లైన్ సర్వీస్ తీసుకురావడం ఎంతో మేలు అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటియే ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మద్యం ఆన్లైన్ అనుమతి ఉంది. స్విగ్గీ, స్పెన్సర్ రిటైల్ పశ్చిమ బెంగాల్ల్ అల్కాహాల్ హోమ్ డెలివరీలు చేస్తున్నాయి.
ఈ విధానం వలన ఏ వ్యవస్థకు ఇబ్బంది ఉండదని తెలుస్తుంది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలో కోవిడ్-19 లాక్డౌన్ల సమయంలో ఈ హోమ్ డెలివరీలు చేశారు. అప్పుడు విజయవంతంగా చేసినట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ స్థానిక ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా మహారాష్ట్రలో డెలివరీని కొనసాగిస్తున్నప్పటికీ ఇది చట్టబద్దం కాదు. ఇలా చేస్తే అమ్మకాలు కూడా పెరుగుతాయని లిక్కర్ సంబంధిత శాఖలు భావిస్తున్నారు. ఆన్లైన్ డెలివరీలు ద్వారా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో 20-30% అమ్మకాలు పెరిగాయని పబ్ చైన్ ది బీర్ కేఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ సింగ్ అన్నారు. దీనిపై కొన్ని విధివిధానాలు రూపొందించాలని చెప్పారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లలో మద్యం కోనుగోలు చేసేవారు eKYC, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్ల మధ్య OTP ధృవీకరణలు వంటివి కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు సంబంధించిన కొన్ని అంశాలను చేర్చి డెలివరీలు మొదలు పెడితే ఉపాధి కూడా లభిస్తుందని రాహుల్ సింగ్ అన్నారు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తామని తెలిపారు.