»Center Instructs Bcci Not To Display Tobacco Ads Banned By Government In Cricket Stadiums
BCCI: నిషేధించిన యాడ్స్ క్రికెట్ స్టేడియంలో ప్రదర్శించొద్దు.. బీసీసీఐకి కేంద్రం కీలక సూచన
క్రిికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో యాడ్స్ ప్రదర్శించే విషయంలో కేంద్రప్రభుత్వం బీసీసీఐకి కీలక సూచనలు చేసింది. ఇకపై పొగాకు ప్రొడక్ట్స్ మ్యాచ్‌లో డిస్ల్పే చేయొద్దని చెప్పింది.
Center instructs BCCI not to display tobacco ads banned by government in cricket stadiums
BCCI: క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. లక్షల్లో అభిమానులు గ్రౌండ్లో ఉంటారు. కోట్లలో వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తారు. క్రికెట్ అంటే కోట్ల బిజినెస్ అందుకే ఆట జరుగుతున్నప్పుడు చాలా యాడ్స్ స్లైడర్స్లో ప్రదర్శిస్తారు. ఈ యాడ్స్‌పై ఇండియన్ క్రికెట్ నియంత్రణ మండలికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేయనుంది. ఇకపై స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగే సమయంలో పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన హోర్డింగ్స్‌ను ప్రదర్శించొద్దని బీసీసీఐని కోరనున్నట్లు తెలుస్తుంది. పాన్ మసాలా కంపెనీ యాడ్స్‌ను ఇకపై స్టేడియంలో షో చేయొద్దని గట్టిగానే చెప్పనుంది. యువత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తాజా అధ్యయనం ప్రకారం పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గత సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్ సమయంలో 41.3శాతం నిషేధిత పొగాకు ఉత్పత్తుల యాడ్స్‌ను హోర్డింగ్స్‌లో చూపించారని ఆ అధ్యయనం పేర్కొంది. అందులో పాన్ బహర్ (Pan Bahar), విమల్, కమలా పసంద్ (Kamala Pasand) వంటి గుట్కా కంపెనీల ప్రకటనలు ఉన్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన 1955 కేబుల్ టీవీ నెట్ వర్క్ నియమాల ప్రకారం పొగాక, పాన్ మసాలా వంటి యాడ్స్‌ను చూపించడంపై నిషేధం. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే బీసీసీఐకి కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారి చేయనున్నట్లు ఓ అధికారి ప్రకటించారు.