»Prithvirajs The Goat Life Into Ott Where Is The Streaming
The Goat Life: ఓటీటీలోకి పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ది గోట్ లైఫ్ తెలుగులో ఆడు జీవితం చిత్రం ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో మంచి స్పందన వచ్చింది. అయితే ఓటీటీకి రావడానికి మాత్రం కాస్త టైమ్ తీసుకుంది. ఇంతకీ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనేది చూద్దాం.
The Goat Life: పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ హీరో అయినా ఇప్పుడు తెలుగు వారందరికీ సూపరిచితుడే. పాన్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ఇటీవలే ఈ హీరో మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం “ది గోట్ లైఫ్” తెలుగులో ఆడు జీవితం పేరుతో విడుదలైంది. బ్లెస్సీ దర్శకత్వంలో అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు నటించారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ మూవీని సర్వైవల్ అడ్వెంచర్‌గా తెరకెక్కించారు. ఈ సంవత్సరం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయంతో పాటు వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చాలా మంది ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇన్నాళ్లకు ఓటీటీలో రావడానికి ముహుర్తం ఫిక్స్ అయింది.
ఆడు జీవితం మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ నెల అంటే జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. పాన్ భాషాల్లో మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవబోతుంది. దీంతో ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఇది నిజంగా గుడ్ న్యూస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే 1990 సంవత్సరంలో కేరళ నుంచి నజీబ్ అనే యువకుడు బతుకుదెరువు కోసం విదేశాలకు వలస వెళ్లిపోతాడు. అక్కడి నుంచి తిరిగి రావడానికి కొన్ని అవరోధాలు ఏర్పడుతాయి. వాటి నుంచి ఆ యువకుడు ఎలా సర్వైవల్ అయ్యాడు అనేది కథ. దీన్ని పూర్తిగా ఎడారి ప్రాంతంలోనే తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.