NTR 30 : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించే సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఎన్టీఆర్ కు 30 వ సినిమా. ఆర్ఆర్ఆర్ 29వ సినిమా. ఎన్టీఆర్ 30 వ సినిమాకు కొరటాల శివ డైరెక్టర్. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు కొరటాల శివ. వీళ్ల కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను వీళ్ల కాంబోలో ప్రకటించారు కానీ.. దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు.
కానీ.. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంచి అకేషన్ కాబట్టి నా సినిమా గురించి చెబుతున్నా. ఫిబ్రవరిలోనే సినిమాను లాంచ్ చేస్తున్నాం. మార్చి 20 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుంది అని తన సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.