»Rohini Rohini Is Angry With The Senior Journalist
Rohini: సీనియర్ జర్నలిస్ట్‌పై మండిపడ్డ రోహిణి
టి రోహిణి ఇటీవల బర్త్‌డే బాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు. అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Rohini: Rohini is angry with the senior journalist
Rohini: ప్రస్తుతం ఏ సినిమా, సిరీస్ ఏదైనా వస్తుందంటే ప్రమోషన్స్ కొత్తగా ట్రై చేస్తుంటారు. అయితే నటి రోహిణి ఇటీవల బర్త్‌డే బాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు. అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బర్త్‌డే బాయ్ ప్రమోషన్స్‌లో రేవ్ పార్టీ థీమ్‌తో వీడియో కేవలం ప్రమోషన్ మాత్రమేనని, నిజమైన రేవ్ పార్టీ కాదని చాలామందికి అర్థమైంది. కానీ సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి తెలియకుండా ఎలా మాట్లాడతారు. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అని తెలుసుకుని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నేను అసలు మందు తాగను. సినిమాల్లో కనిపించినట్లు బయట కూడా అలాగే ఉంటామా? సర్జరీ కారణంగా లావయ్యానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నారు.
అసలు లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా? లావుగా ఉన్నవాళ్లకి పెళ్లిళ్లు కావా? జర్నలిస్ట్ అంటే నిజానిజాలను తెలుసుకుని ప్రజలకు సరైన సమాచారం అందించాలి. ఏమీ తెలియకుండా ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవద్దు. మీకు ఎలాంటి పనిలేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోండి. అంతేకానీ ఇలా మాట్లాడవద్దు. పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా.. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని అని రోహిణి ఆ జర్నలిస్ట్‌పై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.