»Constitution Murder Day June 25 Is Constitution Murder Day
constitution murder day: జూన్ 25న రాజ్యాంగ హత్యాదినం
కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న ఇకపై ఏటా రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Constitution Murder Day: June 25 is Constitution Murder Day
constitution murder day: కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న ఇకపై ఏటా రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశవ్యాప్తంగా 2016 నవంబరు 8న మోదీ పెద్దనోట్ల రద్దును ప్రకటించారు. ఈ తేదీని ఇకపై జీవనోపాధి హత్యాదినంగా ప్రజలు జరుపుకుంటారని తెలిపారు. దీనిపై కూడా త్వరలో గెజిట్ నోటిఫికేషన్ రానుందని తెలిపారు.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వును ఇచ్చిన కొంతసమయానికే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1975 జూన్ 25న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. అలాంటి చీకటి రోజులకు నిరసనగా ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యదివస్గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించారు.