హీరో మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విక్టరీ వెంకటేష్ ఓ సీన్ సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తుండగా…గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ వన్ గా వస్తున్న ఈ మూవీని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా, నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి గల్లా జయదేవ్, బీవీఎస్ రవి, ఆది శేషగిరిరావు సహా పలువురు హాజరయ్యారు.