‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వేణు అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చిరునవ్వుతో, హనుమన్ జంక్షన్ ,చెప్పవే చిరుగాలి, వంటి సినిమాలతో పేక్షకులకు చేరువయ్యాడు. వేణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో వేణు తొట్టెంపూడి మొదట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు.
వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో క్లాస్ మేట్స్ అని వేణు తెలిపారు. మ్యాంగో రామ్ కూడా కొన్ని సినిమాలు చేశారని ఆయన తెలివైన వాడని వేణు వెల్లడించారు. తన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసని వేణు చెప్పుకొచ్చారు. నేను అందరితో కలివిడిగా ఉండేవాడినని వేణు తెలిపారు. నవీన్ హలో అంటే హలో అనేవారని వేణు చెప్పుకొచ్చారు. సిమ్రాన్ అసలు పేరు రిషిబాల అని ఆమె చాలా హార్డ్ వర్కర్ అని వేణు కామెంట్లు చేశారు. బి.గోపాల్ గారు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని వేణు వెల్లడించారు.
ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో స్వయంవరం తొలి సినిమా అని వేణు తెలిపారు. చంద్ర సిద్దార్థ్ ను చందు అని పిలిచేవాడినని త్రివిక్రమ్ శ్రీనివాస్ ను శ్రీను అని పిలిచేవాడినని ఆయన కామెంట్లు చేశారు. నా స్నేహితులు, నా కుటుంబం వల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.నేను మనిషిని కాబట్టి నాకు ఎమోషన్స్ ఉంటాయని నెగిటివ్ గా జరిగితే రెండు రోజులు బాధ ఉంటుందని ఆయన తెలిపారు. భగవంతుడు అందమైన జీవితం ఇచ్చాడని వేణు తెలిపారు. లైఫ్ లో మూవ్ అయిపోతూ ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.