»Team India Victory Parade Tight Security In Place For Roadshow Of T20 World Champions In Mumbai Bus Video Viral
Road Show: టీం ఇండియా రోడ్డు షో బస్సు డిజైన్ అదరహో.. వీడియో వైరల్
టీ20 వరల్డ్ కప్‌లో జగజ్జేతలుగా నిలిచిన భారత టీం ఇవాళ ముంబయిలో విజయోత్సవ ర్యాలీ చేయనుంది. ఇందుకు ఉపయోగించే బస్సు డిజైన్ ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. మరి దానిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
Team India Road Show: టీ20 వరల్డ్ కప్‌ని(T20 World Cup) అందుకుని సగర్వంగా దేశంలోకి అడుగు పెట్టింది ఇండియన్ టీం(Team India). వీరందరితో ముంబయిలో నేడు జరగబోయే రోడ్ షోకి సంబంధించిన బస్సు డిజైన్ వావ్ అనిపించేలా ఉంది. మైదానంలో విజయం అనంతరం కప్పుతో కలిసి అంతా దిగిన ఫోటోని ఈ బస్సుకు ఓ వైపున డిజైన్ చేశారు. ఛాంపియన్స్ 2024, బీసీసీఐ లోగోలను పొందుపరిచారు. బ్లూకలర్ థీంలో ఉన్న ఈ బస్సు చూసేందుకు భలే ముచ్చటగా ఉంది.
ఈ బస్సుతో ఇండియన్ టీం(Team India) ఇవాళ ముంబయి రోడ్ల మీద విజయోత్సవ ర్యాలీ(victory parade) నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుంది. ముంబయి నారిమన్ పాయింట్ దగ్గర ర్యాలీ మొదలవుతుంది. వాంఖడే స్టేడియం ద్గర ముగుస్తుంది. అంటే ఈ బస్సుపై(Bus) టీం ఇండియా ప్లేయర్లు, కోచ్‌లు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ షోకి భారీగా క్రికెట్ అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను కూడా అందుకు అనుగుణంగా చేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? ఆ బస్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేసేయండి.