Double Ismart: స్టెప్మార్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. అయితే మూవీ టీం తాజాగా స్టెప్మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది.
Double Ismart: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్మాన్స్ వచ్చింది. అయితే మూవీ టీం తాజాగా స్టెప్మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. మాస్ బీట్స్‌తో ఉండే ఈ సాంగ్‌లో శివుడు బ్యాక్‌డ్రాప్‌తో చార్మినార్, గోల్కొండ కోటతో పాటు హైదరాబాద్‌లో కొన్ని చోట్ల చిత్రీకరించారు. మాస్ మ్యాజిక్కి రామ్ తన స్టెప్లతో పిచ్చేక్కించేశాడు. ఈ వీడియో లిరికల్ సాంగ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. రామ్-పూరీ ఈసారి సూపర్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన రామ్ లుక్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ను అందించారు. మణిశర్మ బ్లాక్‌బ్లస్టర్ మాస్ మ్యూజిక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపుల్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం పూరీకి బ్లాక్‌బ్లస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.