హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది.
సుమారు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
గతంలో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లు
2002 నవంబర్ 21న దిల్ సుఖ్ నగర్ సాయిబాబ ఆలయం దగ్గర పేలుడు, ఓ మహిళ మృతి, 22 మందికి గాయాలు
2004 నవంబర్ 12న జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ పక్కన బాంబ్ బ్లాస్ట్
2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఆత్మాహుతి దాడి, హోంగార్డు మృతి మరో కానిస్టేబుల్ కు గాయాలు
2007 ఆగస్టు 25న కోఠి సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా దాదాపు 44 మంది మృతి