Ravi Teja: రవితేజ, హరీష్ శంకర్.. కెవ్వు కేక అప్డేట్!
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి కెవ్వు కేక అప్టేడ్ ఇచ్చాడు హరీష్ శంకర్.
Ravi Teja: షాక్ సినిమాతో హరీష్ శంకర్‌ని డైరెక్టర్ చేశాడు రవితేజ. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మిరపకాయ్ సినిమాతో మాత్రం మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తు.. మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ, హరీష్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హరీష్ శంకర్ అనుకున్న సమయానికి మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్ చేసి.. వీలైనంత త్వరగా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా నుంచి షో రీల్ అంటు ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివితో వచ్చిన ఈ షో రీల్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. రవితేజ తనదైన ఎనర్జీతో దుమ్ముదులిపేశాడు.
ఇందులో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రచ్చ చేసినట్టుగా చూపించారు. అలాగే.. విలన్‌గా జగపతి బాబు టెర్రిఫిక్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ భాగ్రశ్రీ బొర్సె కూడా సూపర్ క్యూట్‌గా కనిపించింది. మొత్తంగా పక్కా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ షో రీల్ కట్ చేశాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు మరో సూపర్ అప్డేట్ ఇచ్చాడు హరీష్. ‘నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా.. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా..’ అంటూ సాగే సాంగ్ అప్డేట్ ఇచ్చాడు. సాహితి పాడిన ఈ పాటను షూట్ చేయడం చాలా ఉత్సాహంగా ఉంది.. అంటూ రాసుకొచ్చాడు. గతంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక, డీజే మూవీలో అస్మైక యోగ పాటలు పాడింది సాహితి. ఆ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో.. ఈ సాంగ్ కూడా కెవ్వు కేక అనేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు హరీష్. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి మిస్టర్ బచ్చన్ సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.