»Ravi Tejas Mr Bachchan Show Reel Release Not Usual
Ravi Teja: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ రిలీజ్.. మామూలుగా లేదుగా?
చెప్పినట్టేగా యమా స్పీడ్‌గా మిస్టర్ బచ్చన్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. రవితేజ కూడా తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ రిలీజ్ చేయగా.. మామూలుగా లేదు.
Ravi Teja: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కారణంగా సెట్స్ పై ఉన్న సినిమాలను కాస్త హోల్డ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ అదిరిపోయింది. అయితే.. ఉస్తాద్ తిరిగి సెట్స్ పైకి వెళ్లేలోపు మాస్ మహారాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. మిరపకాయ్ కాంబో రిపీట్ చేస్తు.. మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ, హరీష్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హరీష్ శంకర్ అనుకున్న సమయానికి మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్ చేసి.. వీలైనంత త్వరగా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ అంటు ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివితో వచ్చిన ఈ షో రీల్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది.
రవితేజ తనదైన ఎనర్జీతో దుమ్ముదులిపేశాడు. ఇందులో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రచ్చ చేసినట్టుగా చూపించారు. అలాగే.. విలన్‌గా జగపతి బాబు టెర్రిఫిక్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ భాగ్రశ్రీ బొర్సె కూడా సూపర్ క్యూట్‌గా కనిపించింది. మొత్తంగా పక్కా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ షో రీల్ కట్ చేశాడు హరీష్ శంకర్. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమానిగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.