SDPT: జనగామ జిల్లా కేంద్రంలో శివతేజ జానపద సాంస్కృతిక కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జానపద కళోత్సవాల్లో, కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారధి, కవి-గాయకుడు పిన్నింటి రత్నానికి “కళారత్న అవార్డు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లిట్ల యాదగిరి స్మారకంగా అందించిన ఈ అవార్డు తనకు గౌరవమని పేర్కొన్నారు.