వరస ప్లాప్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా మరో సినిమాని లైన్ లో పెట్టాడు. కాగా.. ఈ సినిమాలో ధమాకా బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయడం విశేషం. అసలు విషయంలోకి వెళితే
Ravi Teja: వరస ప్లాప్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా మరో సినిమాని లైన్ లో పెట్టాడు. కాగా.. ఈ సినిమాలో ధమాకా బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయడం విశేషం. అసలు విషయంలోకి వెళితే.. రవితేజ కెరీర్లో చివరి పెద్ద విజయం ధమాకా. ఈ ప్రాజెక్ట్ తర్వాత, మాస్ మహారాజా రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. పాపం చాలా కష్టపడుతున్నాడు కానీ.. విజయం మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ లో మరో మైలురాయికి చేరుకున్నారు. త్వరలో 75 వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను ఎంచుకోవడం విశేషం.
ధమాకా శ్రీ లీలా కెరీర్‌కు ఒక మలుపు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ , డ్యాన్స్ కమర్షియల్ ఎంటర్టైనర్ ద్వారా బాగా ప్రశంసిలు అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల కూడా వరస ప్లాపులతో కాస్త ఢీలా పడింది. దీంతో.. తనకు హిట్ ఇచ్చిన రవితేజతో మరోసారి జోడి కట్టడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రవితేజ తన 75 వ చిత్రం కోసం, కొత్త దర్శకుడు భాను భోగవరపుతో జతకట్టనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి. ధమాకా చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ ఈ ప్రాజెక్ట్‌కి కూడా స్వరాలు సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.