ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చట్టుపక్కలకు భారీగా వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురియ్యారు