మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా విశ్వంభర కోసం యంగ్ హీరోయిన్ను తీసుకున్నారు మేకర్స్. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా.. ఇప్పుడు యంగ్ హీరోయిన్ రాకతో విశ్వంభర మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
Vishwambara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘విశ్వంభర’. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫాంటసీ డ్రామగా చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది త్రిష. అయితే.. ఈ సినిమాలో త్రిషతో పాటు మరికొంత ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు. తాజాగా యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఫైనల్ అయినట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆమెకు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఆషికా రంగనాథ్ యమా క్యూట్‌గా ఉంది.
విశ్వంభరలో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇటీవలె నాగార్జున సరసన ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అమ్మడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే.. ఆషికా ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ జులై నెల చివరికల్లా పూర్తి చేసి సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ పై ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ఠ సరికొత్త వరల్డ్ సృష్టించినట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి.